బస్టాండ్లలో ఎంఆర్పీకి మించి అమ్మితే చర్యలు

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): బస్టాండ్లలోని దుకాణాల్లో నిబంధనలు అతిక్రమిస్తూ ఎంఆర్పీ (గరిష్ఠ చిల్లరధర) కంటే ఎక్కువకు వస్తువులు విక్రయించేవారిపై చర్యలు తప్పవని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువకు విక్రయించినా, నకిలీ, నిషేధిత వస్తువులు విక్రయించినా దుకాణదారుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సజ్జనార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నట్టు గుర్తిస్తే ప్రయాణికులు వెంటనే స్టేషన్ మేనేజర్‌కు లేదా కంట్రోలర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉచితంగా వాడుకునే టాయిలెట్లకు సైతం డబ్బులు వసూలుచేసే వారిపై అధికమొత్తంలో జరిమానాలు విధిస్తామని తెలిపారు. లైసెన్స్ ఒప్పందాల రద్దుకు నోటీసులు జారీచేస్తామని పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జేబీఎస్, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, హన్మకొండ బస్స్టేషన్లలో తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులకు రూ.52 వేల జరిమానాతోపాటు నోటీసులు జారీచేసినట్టు వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

