KU | కేయూలో ఏబీఎస్ఎఫ్ నాయకుల నిరసన
KU | వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేయూలో నల్లబ్యాడ్జీలతో ఏబీఎస్ఎఫ్ నాయకులు నిరసన చేపట్టారు.
KU | హనుమకొండ చౌరస్తా: తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యింది. అయినా ఇప్పటి వరకు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా పూర్తిగా మోసం చేసిందని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీ (Kakatiay University) గ్రంథాలయం వద్ద ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం మంద నరేష్ మాట్లాడుతూ రాష్ర్టంలో చదువుతున్న ఒక్క విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విఫలమయ్యారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఫీజులు (Fee) విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్స్ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం అందించడంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ కేయూ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్ప భరత్, ఉపాధ్యక్షులు ప్రణయ్, కార్తీక్, శ్రీను, రవి, దీక్షిత్, కళ్యాణ్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

