యువ హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నిఖిల్ కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. కెరీర్‌పరంగా తన ఉన్నతిలో తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉందని హీరో నిఖిల్ అనేక సందర్భాల్లో చెప్పారు.