Abisekh Bachchan| బాలీవుడ్ క్రేజీ జంటలలో ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ జంట ఒకటి. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ పెళ్లి 2007 ఏప్రిల్ 20న జరిగింది. వీరికి 2012 లో ఆధ్య అనే కూతురు కూడా జన్మించింది. త్వరలో ఆద్యని కూడా ఇండస్ట్రీకి తీసుకురానున్నారు అనే టాక్ నడుస్తుంది. ఇక ఈ మధ్య వీరు విడాకులు తీసుకోబోతున్నారంటు పుకార్లు బాలీవుడ్ అంతటా వ్యాపించగా, దానిపై అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లు స్పందించింది లేదు. కాకపోతే ఇటీవల జరిగిన కొన్ని వేడుకలలో అభిషేక్ బచ్చన్,ఐశ్వర్యరాయ్ జంటగా కనిపించే సరికి పుకార్లకి పులిస్టాప్ పడింది.
ఇక ఇదిలా ఉంటే అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టూ టాక్ చిత్రానికి గాను ఆయనకి ఉత్తమ నటుడి అవార్డ్ దక్కింది. ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దర్శకుడి వల్లే తనకి ఈ అవార్డ్ వచ్చిందని అన్నారు. అనంతరం తోటి నటుడు, షో హోస్ట్ అర్జున్ కపూర్‌తో సరదాగా ముచ్చటించారు అభిషేక్ బచ్చన్. అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. నేను మీతో మాట్లాడాలి అంటూ ఎవరు ఫోన్ చేస్తే మీకు కంగారు వస్తుందని అభిషేక్‌ని ప్రశ్నించాడు. దానికి అభిషేక్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. నీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. ఒకసారి పెళ్లైతే ఈ ప్రశ్నకి నీ దగ్గర కూడా ఓ సమాధానం ఉంటుంది. భార్య ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అంటే కంగారు పడతాం, ఆ ఫోన్ కాల్స్ మనల్ని ఒత్తిడికి గురవుతాయి అంటూ సరదాగా కామెంట్ చేశారు అభిషేక్.
అభిషేక్ బచ్చన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిషేక్ బచ్చన్, అందాల తార ఐశ్వర్యరాయ్ ల గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ పలు చిత్రాల్లో నటించి మెప్పించి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. వీరు తమ కెరీర్ ఫీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారు. గత 18 ఏండ్లుగా వీరు తమ వైవాహిక బంధాని సాఫీగా సాగిస్తున్నారు. అయితే.. అడపాదడపా వీరి మధ్య మనస్పర్థాలు తలెత్తాయనీ, వీరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయని ఏవేవో ప్రచారాలు జరుగుతుంటాయి. వాటిని ఈ ఇద్దరు లైట్ తీసుకుంటారు.