హైదరాబాద్, ఆట ప్రతినిధి : కెప్టెన్ అభిరథ్ రెడ్డి (49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82) దంచికొట్టడంతో టీజీ 20 లీగ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ ఫైనల్ చేరుకుంది. లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి క్వాలిఫయర్-1లో ఓడిన హైదరాబాద్.. రెండో క్వాలిఫయర్‌లో మాత్రం పంజా విసిరింది. ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కరీంనగర్ డైమండ్స్‌ను ఓడించింది.
డైమండ్స్ ఇచ్చిన 158 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిరథ్తో పాటు వికాస్ రెడ్డి (45) కూడా రాణించాడు. తొలుత కరీంనగర్ డైమండ్స్ 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది. హృషికేశ్ సింహా (38), శుభమ్ శర్మ (31 నాఔట్) టాప్ స్కోరర్లు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్‌గౌడ్, అశ్విన్, ప్రణవ్, తలో మూడు వికెట్లు పడగొట్టారు. అభిరథ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఖమ్మం ఏసెస్‌తో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది.