హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో 7 టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. స్టేట్ లెవల్లో 2, మల్టీజోన్ లెవల్లో 5 చొప్పున పోస్టులున్నాయి.
ఈ పోస్టులకు ఈ నెల 15 నుంచి ఆగస్టు 22 వరకు వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.