హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రతి అథ్లెట్ ప్రయాణంలో రికవరీ అనేది అత్యంత ముఖ్యమైన భాగమని, అయినప్పటికీ దానికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. అథ్లెట్ల అవసరాలను అర్థం చేసుకుంటూ, వాస్తవ అభిప్రాయాల ఆధారంగా క్రీడా ఉత్పత్తులను సైతం మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నాడు.
శిక్షణా సెషన్ల మధ్య అథ్లెట్లు త్వరగా కోలుకోవడానికి సౌకర్యవంతమైన, సహాయక ఫుట్‌వేర్ సైతం కీలక పాత్ర పోషిస్తాయన్నాడు. ఈ క్రమంలో చుప్స్ బ్రాండ్‌తో తమ అకాడమీ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని గోపీ పేర్కొన్నాడు.