Tamannaah Bhatia | మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah) సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రీసెంట్గా 18 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఇప్పటికీ ఈ భామ అటు సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్‌లు (‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’)లతో అలరిస్తుంది. తమన్నా కెరీర్ కాస్త స్లో అయ్యింది అనుకుంటున్న సమయంలోనే తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ (Bhola Shanker). తమిళంలో రజనీకాంత్ జోడీగా ‘జైలర్'(Jailer) చిత్రాల్లో నటించి మళ్లీ తన జోరు చూపిస్తున్నది. తాజాగా ఈ రెండు చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నాయి. అయితే తమన్నా తాజాగా నటించిన వెబ్‌సిరీస్ ‘ఆఖరి సచ్’(Aakhri Sach). క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. 2018లో దేశ రాజధాని న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో 11 మంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన (Burari Deaths) ఆధారంగానే ఆఖరి సచ్ సిరీస్ రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో తమన్నా కనిపించనుంది. ఆగస్టు 25 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్ పేరిట డాక్యుమెంట్ సిరీస్ తీసింది.
ఇక ఆఖరి సచ్ వెబ్ సిరీస్‌ను నిర్వికార్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో తమన్నాతో పాటు.. పాతాల్ లోక్ ఫేమ్ అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, దనిష్ ఇక్బాల్, నిషూ దీక్షిత్, క్రితి విజ్, సంజీవ్ చోప్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
A bone chilling tale that unravels the most twisted ties of fate, trapped secrets of a family and
terrifying horrors an investigator has ever seen. Watch #HotstarSpecials #AakhriSach from 25th
August.#AakhriSachOnHotstar pic.twitter.com/8TQm0m503U— Disney+ Hotstar (@DisneyPlusHS) August 11, 2023