న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాల్కర్‌ను ఆమె భాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూజానావాలా ముక్కలుగా కోసి చంపిన విషయం తెలిసిందే. శ్రద్ధాను ముక్కలు చేసేందుకు అఫ్తాబ్ రంపం వాడినట్లు అటాప్సీ రిపోర్ట్‌లో తెలిపారు. శ్రద్ధా ఎముకలకు జరిపిన పరీక్షల ద్వారా ఆ నిర్ధారణకు వచ్చారు. గత నెలలో మెహరౌలీ ఫారెస్టులో పోలీసులు ఎముకల్ని గుర్తించారు. ఆ ఎముకలకు నిర్వహించిన డీఎన్ఏ పరీక్ష ద్వారా అవి శ్రద్ధావే అని తేల్చారు. ఆమె ఫ్లాట్‌లో రక్తపు మరకలకు నిర్వహించిన పరీక్ష ద్వారా కూడా అది శ్రద్ధావే అని గుర్తించారు. తండ్రి నుంచి సేకరించిన డీఎన్ఏ శ్యాంపిళ్ల ద్వారా పరీక్షలు కొనసాగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శ్రద్ధా ఎముకలకు అటాప్సీ నిర్వహించారు.