మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో అనుమాన స్పదంగా ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య ( Youth Suicide ) చేసుకున్నాడు. గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గుడి గుడి శంకర్(23) అనే యువకుడు మండల కేంద్రానికి చెందిన యువతిని ప్రేమించాడు.
ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు శంకర్‌ను ఆదివారం కిడ్నాప్ చేసి బెదిరించి, కొట్టి వదిలేశారని తెలిపారు. ప్రేమించిన యువతి తనకు దక్కదేమోనన్న బాధతో ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడని మృతుడి సోదరుడు మహేష్ ఫిర్యాదు చేశాడని ఎస్సై అశోక్ బాబు వివరించారు. ఈ ఘటనపై ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్న మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.