కోహిర్ : సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని బిలాల్పూర్ గ్రామానికి చెందిన గూళ్ల శేఖర్(32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం కేసులో పోలీసుల వేధింపుల వల్లే శేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కొట్టడం తోనే శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధితులు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావుకు వివరించారు.
దీంతో బాధ్యులను సస్పెండ్ చేయాలని జహీరాబాద్ ప్రభుత్వ దవాఖాన వద్ద శేఖర్ మృతదేహంతో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.