బెంగుళూరు: కర్నాటకలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో.. ఓ వ్యక్తి పూలమాలతో దూసుకువచ్చాడు. హుబ్లీలో ఇవాళ ప్రధాని రోడ్ షో నిర్వహించారు. బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో ఉన్న మోదీ.. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో.. అకస్మాత్తుగా ఓ కుర్రాడు చేతుల్లో పూలదండతో ప్రధాని మోదీ వైపు పరుగులు తీశాడు. అయితే ప్రధాని పక్కనే ఉన్న ఎస్పీజీ సిబ్బంది ఆ కుర్రాడిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి చేతుల్లో ఉన్న పూలదండను తీసుకున్న మోదీ తన వాహనంపై వేశారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఇదే.
#WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.
(Source: DD) pic.twitter.com/NRK22vn23S
— ANI (@ANI) January 12, 2023