సిటీబ్యూరో, జనవరి 6(నమస్తే తెలంగాణ): ఓ కార్మికుడు.. దోపిడీ దొంగగా మారుదామని.. ఏకంగా తుపాకీ కొనుగోలు చేశాడు. అతడు నేరాలకు పాల్పడకముందే.. పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..చార్మినార్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ మార్బుల్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో గన్‌తో బెదిరించి.. దోచుకోవాలని పథకం వేసుకున్నాడు. యూపీకి వెళ్లి.. రూ. 20 వేలకు దేశవాళీ తుపాకీతో పాటు ఆరు బుల్లెట్లను కొన్నాడు. తన మకాన్ని చార్మినార్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి మార్చాడు. గురువారం చింతల్‌కుంట ప్రాంతంలో తిరుగుతుండగా రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ, ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.