పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంథని పట్టణం ఎరుకల గూడెంలో ఓ మహిళ దారుణ హత్యకు(Brutally murdered) గురైంది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి మహిళ గొంతు కోసి హతమార్చారు. మృతురాలు మంథని మండలం గుమ్మునూరు గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్ రేషన్ డీలర్ బందెల రాజమణిగా గుర్తించారు. సమాచారం అందుకున్నర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజమణికి నలుగురు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోవడంతో సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. భార్య పిల్లలు వున్న సంతోష్ రాజమణిని హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.