న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జిమ్మీ కార్టర్(Jimmy Carter).. ఇండియాలో పర్యటించారు. హర్యానాలోని గురుగ్రామ్ విలేజ్‌ను ఆయన సతీసమేతంగా 1978లో విజిట్ చేశారు. ఆ గ్రామానికి కార్టర్పురి అని పేరు పెట్టారు. జిమ్మీ కార్టర్ వచ్చి వెళ్లిన తర్వాత ఆ ఆ ఊరు పేరును మార్చారు. కార్టర్ మరణించినట్లు వార్త తెలియగానే ఆ గ్రామ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ ఊరి ప్రజలు ప్రత్యేక నివాళి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
భారత్‌ను విజిట్ చేసిన అమెరికా మూడవ అధ్యక్షుడిగా కార్టర్‌కు గుర్తింపు ఉన్నది. ఎమర్జెన్సీ రోజులు ముగిసిన తర్వాత ఆ డెమోక్రటిక్ నేత ఇండియాకు వచ్చారు. హర్యానాలోని దౌల్తాపూర్ నసీరాబాద్ గ్రామాన్ని విజిట్ చేశారు. 1960 దశకంలో జిమ్మీ కార్టర్ తల్లి లిల్లియన్ గోర్డీ కార్టర్ .. దౌల్తాపూర్‌లో పీస్ కార్ప్స్ వాలంటీర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో జిమ్మీ కార్టర్ తన తల్లి పనిచేసిన ప్రదేశాన్ని విజిట్ చేశారు. అయితే జిమ్మీ కార్టర్ వచ్చి వెళ్లిన తర్వాత ఆ గ్రామానికి కార్టర్పురి అని పేరు పెట్టారు.
మా ఊరి పేరును హర్యానాలోని మరో పేరుతో పోల్చలేమని, మా ఊరి పేరు ప్రత్యేకమైందని ఓ వ్యక్తి తెలిపాడు. జిమ్మీ కార్టర్ తమ ఊరును విజిట్ చేసిన సమయంలో ఆ వ్యక్తి 18 ఏళ్లు ఉన్నాడు. ఆ రోజు జరిగిన సంఘటనలను ఆయన మీడియాకు వివరించాడు. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని అప్పుడు చూసినట్లు చెప్పారు. తలపై దుపట్టా లేకుండా తొలిసారి ఓ తెల్ల అమ్మాయిని చూశామన్నారు. గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించి, కార్టర్ పేరును తమ ఊరికి పెట్టినట్లు చెప్పాడు. కార్టర్పురి అని పేరు పెట్టినందుకు.. జిమ్మీ కార్టర్ ఆ తర్వాత తమ పంచాయతీకి లేఖ కూడా రాసినట్లు తెలిపాడు.
2002లో జిమ్మీ కార్టర్‌కు నోబుల్ శాంతి బహుమతి దక్కింది. ఆ సమయంలో కార్టర్పురి సంబరాల్లో తేలినట్లు ఆ వ్యక్తి గుర్తు చేశాడు. జనవరి మూడవ తేదీన కార్టర్ తమ ఊరును విజిట్ చేశారని, దీంతో ఆ రోజును స్థానికంగా సెలువు దినంగా ప్రకటించామన్నారు. కార్టర్ మరణానికి నివాళిగా ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.