సుబేదారి, ఫిబ్రవరి03 : వరంగల్ నగరంలోని హంటర్ రోడ్డు కాకతీయ జూలజికల్ పార్క్ లో(Warangal Zoo Park) వైట్ టైగర్ (శరణ్) మంగళవారం తెల్లవారుజామున ఎక్లోజర్ లో చనిపోయింది. కాగా, వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ తో చనిపోయిందని జూ అధికారులు అంటున్నారు. మంగళవారం పులి అంత్యక్రియలు చేసినట్లు జూపార్క్ పర్యవేక్షణ అధికారి మయూరి తెలిపారు. అయితే అధికారుల మెంటనెన్స్ సరిగా లేకనే రెండు రోజులుగా అనారోగ్యానికి గురై చనిపోయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ జూ పార్క్ నుంచి తెల్ల పులిని జూలై మాసంలో వరంగల్ తీసుకొచ్చారు. పులి సంరక్షణ సరిగా లేకనే అనారోగ్యానికి గురై మృత్యు వాత పడినట్లు సమాచారం. అధికారులు మాత్రం పులి అనారోగ్యం, గుండె పోటుతో చనిపోయిందని చెబుతున్నారు. జిల్లా అధికారులు పులి మృతి విషయం గోప్యన్గా ఉంచి, అంత్యక్రియల తరువాతనే అనారోగ్యంతో మృతి చెందినదని జూ అధికారి చెప్పడం గమనార్హం.