న్యూఢిల్లీ : ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ వద్ద అనుమానాస్పద వస్తువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. నేషనల్ మీడియా సెంటర్ వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఐఎస్ఎఫ్, డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశాయన్నారు. తనిఖీల్లో ఎలాంటి బాంబులు, పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని, పాలిథీన్ కవర్లో చుట్టిన ప్లాస్టిక్ బొమ్మ లభ్యమైందని పోలీసులు తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Bomb squad and dog squad present at the spot, after a suspicious object was found outside National Media Centre in New Delhi today pic.twitter.com/yMp7V0iA5p
— ANI (@ANI) April 5, 2021