భీమదేవరపల్లి, ఫిబ్రవరి 01 : సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని డ పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించిన మహానేతపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. విచారణకు అంగీకరిస్తానని చెప్పినా కూడా.. అతని ఇంటిపై సిట్ అధికారులు పోస్టర్ ను అంటించడం కుట్రలో భాగమే అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు తీసుకు వస్తుండగా పోలీసులు అడ్డగించారు.
దీంతో సీఎం చిత్రపటం కాల్చే ప్రయత్నం చేయగా ఎస్ఐ రాజు లాక్కున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మండల సురేందర్, నాయకులు వంగ రవి, జక్కుల అనిత, గద్ద కుమారస్వామి, శిక ప్రదీప్, దార్న శ్రీనివాస్, అరకాల రాజు, అప్పని పద్మ, వేముల సాధన, అప్పని బిక్షపతి, కండె సుధాకర్, శనివారం సదానందం, ఇక్బాల్, మాడిశెట్టి కుమారస్వామి, రాజలింగం నాయక్, ఎల్తూరి ప్రభాకర్, జక్కుల రమేష్, రచ్చ సంపత్, యామ వెంకట రాములు, తిరుపతి రావు, కూన యాదగిరి, మాడుగుల అశోక్, గుడికందుల బాలరాజు, సంజీవ్, ఎదులాపురం మొగిలి, రాగం రమేష్, మర్రి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.