కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఓ వ్యాపారి(43)కి నిఫా వైరస్ సోకి ఉండొచ్చని గురువారం ప్రాథమిక పరీక్షలో వెల్లడైంది. ధ్రువీకరణ కోసం అతడి నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అతడికి ప్రస్తుతం కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అతడు ఇటీవల ఎవరెవరిని కలిశాడో గుర్తించి వారికి పరీక్షలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అతడు ఇటీవల ఒక గోదామును శుభ్రం చేశాడని.. ఆ సమయంలోనే అతడికి వైరస్ సోకి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. బాధితుడు ఇటీవల చాలా మందిని కలిశాడని… ఆ తర్వాత చికిత్స కోసం ఒక ప్రైవేట్ దవాఖానకు వెళ్లాడని.. ఈ నేపథ్యంలో నిఫా వైరస్ కేసులు పెరిగితే వాటిని ఎదుర్కోవడానికి అన్ని వైద్య సదుపాయాలను సిద్ధం చేశామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మురళీధరన్ తెలిపారు.