ఇది గుండెల్ని పిండేసే జోనర్!
‘దీవాన’ హృదయాన్ని కదిలించే ప్రేమకథా చిత్రమని, ైక్లెమాక్స్‌లో ప్రతీ సీన్ కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
‘దీవాన’ హృదయాన్ని కదిలించే ప్రేమకథా చిత్రమని, ైక్లెమాక్స్‌లో ప్రతీ సీన్ కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..ఈ సినిమాలో వన్‌సైడ్ లవ్‌తో సమానంగా పేరెంట్స్ లవ్ ఉంటుందని, తెలంగాణ నుంచి పదిమంది యాక్టర్స్‌ని తీసుకున్నామని చెప్పారు.
‘ఇది వన్‌సైడ్‌లో నడిచే లవ్‌స్టోరీ. జోనర్ ఏంటని అడిగితే గుండెల్ని పిండేసే జోనర్ అని చెప్పొచ్చు. ఇందులోని ప్రేమికులు ఏడిపిస్తారు, నవ్విస్తారు. మనల్ని ప్రేమలో పడేలా చేస్తారు’ అని నిర్మాతలు వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి తెలిపారు. ఇదొక టైమ్‌లెస్ లవ్‌స్టోరీ అని, ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమా రాలేదని హీరో హర్షిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్సేన్, నిర్మాత ధీరజ్ మొగిలినేని తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

