దుండిగల్, మార్చి 31: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రగతినగర్‌లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (వీఎన్ఆర్ వీజేఐఈటీ)లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంగీపురం రాధాకృష్ణ ప్రపంచంలోని అత్యున్నత రెండు శాతం శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించారు. ఈ సందర్భంగా గురువారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ సీడీ నాయుడు, ఐటీ విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డీ శ్రీనివాసరావు, డాక్టర్ బీ చెన్నకేశవరావు, డాక్టర్ ఎన్ మంగతాయారు తదితరులు ప్రొఫెసర్ రాధాకృష్ణను సత్కరించి అభినందించారు.