ముంబై: రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్ ఇంటికి మంగళవారం బెదిరింపు ఫోన్ కాల్ చేసిన నిందితుడిని ముంబై పోలీసులు గుర్తించారు. నిందితుడు బీహార్‌కు చెందిన నారాయణ్ కుమార్ సోనిగా గుర్తించి.. అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళే అతడిని ముంబైకి తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఓ గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం శరద్‌పవార్ నివాసమైన సిల్వర్ ఓక్‌కు ఫోన్ చేసి పవార్‌ను చంపేస్తానని బెదిరించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని ట్రాక్ చేసే పనిలో పడ్డారు. చివరికి బీహార్‌కు చెందిన నారాయణ్ కుమార్ అనే వ్యక్తే నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.