హైదరాబాద్ : శంషాబాద్(Shamshabad) మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం(Fire broke) చోటు చేసుకుంది. రాల్లగూడ రోడ్లో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో(Scrap shop) శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు అగ్నిమాక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, పక్కనే సిలిండర్ గోదాం ఉండడంతో ప్రమాదం పొంచి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.