కోయంబత్తూర్: ఎన్నికల వేళ ఓట్ల కోసం నాయకులు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. రకరకాల ఫీట్లు చేస్తూనే ఉంటారు. కానీ తమిళనాడులో మాత్రం తన అభిమాన నేత కోసం ఓ వ్యక్తి అరుదైన ఫీట్ చేశాడు. యోగా టీచర్ అయిన ఆ వ్యక్తి ఆర్ఎస్ పురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐఏడీఎంకే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి అయిన ఎస్పీ వేలుమణి కోసం తలకిందులుగా నడుస్తూ కారును లాగాడు. ప్రచారం చేస్తూనే యోగా, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతోనే తాను ఈ ఫీట్ చేసినట్లు అతను చెప్పాడు.
Coimbatore: A yoga instructor walked upside down yesterday while pulling a car in RS Puram to campaign for AIADMK candidate & state minister SP Velumani ahead of #TamilNaduElections2021
— ANI (@ANI) March 24, 2021
"I want to create awareness about yoga & its health benefits while campaigning," he said pic.twitter.com/OeGfFSPGaH