హైదరాబాద్ : ఆ యువకుడికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎంతో అభిమానం. నిరంతరం కేసీఆర్ను ఫాలో అవుతుంటాడు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా క్షణాల్లో కదులుతాడు.. కార్యక్షేత్రంలో నిమగ్నమవుతాడు. అలా కేసీఆర్పై తనకున్న అభిమానాన్ని ఆ యువకుడు వినూత్నంగా పంచుకున్నాడు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఆయన పొట్రైట్ను హైదరాబాద్కు చెందిన రఘు లెంకలపల్లి చిత్రీకరించి బర్త్డే విషెష్ తెలిపాడు.
తనకు కేసీఆర్ అంటే ఎంతో అభిమానం అని రఘు తెలిపాడు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని ఆ యువకుడు స్పష్టం చేశాడు. రఘు ప్రస్తుతం మహాత్మా గాంధీ లా కాలేజీలో లా ఫైనలియర్ చదవుతున్నాడు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన పురస్కరించుకొని 'లా' స్టూడెంట్ రఘు లెంకలపల్లి.. కేసీఆర్ పొట్రైట్ చిత్రీకరించి బర్త్ డే విషెష్ తెలిపాడు. #HappyBirthdayKCR pic.twitter.com/qRdfA3Kgtv
— Namasthe Telangana (@ntdailyonline) February 17, 2022