TS Inter results | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేయనున్నారు.
ఇంటర్ పరీక్షలకు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in, http:// results. cgg.gov.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు. ‘నమస్తే తెలంగాణ’కు సంబంధించి www. ntne ws. com, www. telanganatoday.comలో ఫలితాలు తెలుసుకోవచ్చు.