కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం, బెల్లంపల్లితో పాటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలాల మధ్య అడవుల్లో పెద్ద పులి సంచారం ( Tiger Roaming ) కలకలం సృష్టిస్తోంది . ఇటీవల కాలంలో కేవలం దేవాపూర్, ధర్మారావుపేట అటవీ పరిధిలోనే మూడు ఆవులు, దూడలపై పులి దాడులు చేసింది.
కాసిపేట మండలంలోని ధర్మారావుపేట( Dharmarao Peta ) , దేవాపూర్ ( Devapur ) , ఆరెడిపల్లి, వెంకటాపూర్, లక్ష్మీపూర్, ఆరెడపల్లి, బెల్లంపల్లి అటవీ శివారుతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి, రెబ్బెన మధ్య పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. శివారు గ్రామాల రైతులు పంట పొలాల్లోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లకుండా బయట మేపుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పెద్దపులి సమాచారం తెలిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, పశువులపై పులి దాడులు చేస్తే బాధిత రైతుకు నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు. పులి కదలికలపై ధర్మారావుపేట ఎఫ్ఎస్వో సత్యనారాయణ, ఎన్టీవో యుగేంధర్, ఎఫ్ బీవో భాస్కర్, ఎనిమల్ ట్రాకర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.