కడ్తాల్ : భారత్, పాకిస్థాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులు మురళినాయక్( Murali Naik ) , సచిన్‌యాదవ్ ( Sachin Yadav ) లకు కడ్తాల్ మండల కేంద్రంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్‌నాయక్ ఆధ్వర్యంలో ఘన నివాళులు ( Tribute) అర్పించారు. ముందుగా జాతీయ జెండాలతో పార్టీలకు ఆతీతంగా భారీ ర్యాలీ ( Rally ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సరైన బుద్ది చెప్పిందని అన్నారు.
పాకిస్థాన్‌లో టెర్రరిస్టులు చనిపోతే అక్కడి ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదులకు లాంఛనప్రాయంగా అంత్యక్రియలు నిర్వహించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా పాకిస్థాన్ క్షమపణ చెప్పి వెనకడుగు వేయకపోతే భారత్ చేతిలో కుక్క చావు చావడం ఖాయమన్నారు.
కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచులు తులసీరాంనాయక్, లోకేష్‌నాయక్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాఘవేందర్, నాయకులు రాందాస్‌నాయక్, పాండునాయక్, మన్యానాయక్, రెడ్డి నాయక్, రవీందర్‌రెడ్డి, రాంచంద్రయ్య, భగీరథ్, జైపాల్‌నాయక్, కళ్యాణ్‌నాయక్, రమేష్‌నాయక్, సరియా నాయక్, శ్రీనునాయక్, శివరాం, శ్రీకాంత్, శ్రీను, అంజీ, సోమ్లా, కుమార్, సక్రు, శ్రీకాంత్, రాజు, బిచ్చ, మధు, సురేష్, సతీష్, శ్యామ్, శంకర్, రవి, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధకరం
దేశ రక్షణలో తెలుగుబిడ్డ మురళినాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధకరమని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి అన్నారు. వీరమరణానికి శ్రద్దాంజలి ఘటిస్తూ పర్యావరణం ప్రేమికుడు పాలడుగు జ్ఞానేశ్వర్ పర్యావరణ శిక్షణ కేంద్రమైన ది ఎర్త్ సెంటర్ ప్రాంగణంలో మురళినాయక్ జ్ఞాపకర్తంగా మహాబిల్వ మొక్కనాటి దానికి మురళినాయక్ పేరు నామకరణం చేశారు. కార్యక్రమంలో రైతు అంజయ్య పాల్గొన్నారు.