మంచిర్యాల: ప్రజల రక్షణే పరమావధిగా పనిచేయాల్సిన పోలీసులే తాగి వీరంగం సృష్టించడం కలవరం పెడుతుంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎస్సైగా పనిచేస్తున్న ఆవుల తిరుపతి, స్నేహితులతో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిన్న రాత్రి మద్యం తాగి వీరంగం సృష్టించారు. దీంతో స్థానికులు 100కు డయల్ చేయగా మంచిర్యాల పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరిని చూసిన ఎస్సై తిరుపతి, అతడి స్నేహితులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఎస్సైతీరుపై సర్వత్రా విమర్శలు రాగా బుధవారం ఎస్సైతో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.