షాద్‌నగర్‌టౌన్, నవంబర్ 25 : షాద్‌నగర్ పట్టణాన్ని గురువారం ఉదయం 8గంటల వరకు పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షాద్‌నగర్ బైపాస్‌రోడ్డులో లైట్లు వేసుకుని వెళ్లారు.
9గంటల వరకు మంచు తెరలు..
కొందుర్గు, నవంబర్ 25 : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని అన్ని గ్రామాల్లో 9గంటల వరకు మంచు కప్పేసింది. వీధి దీపాలను 9గంటల వరకు అలాగే ఉంచారు.
ముంబాయి-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై..
షాబాద్, నవంబర్ 25 : షాబాద్ మండలంలో ఉదయం 8గంటల వరకు మంచు కమ్ముకున్నది. ముంబయి-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాల రోడ్లు, పీఆర్ఆర్ స్టేడియాన్ని మంచు కమ్మేసింది. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు మంచు కారణంగా కొద్దిగా ఆలస్యంగా వెళ్లారు.
శంకర్పల్లి పట్టణంలో..
శంకర్పల్లి, నవంబర్ 25 : శంకర్పల్లి పట్టణంలో మంచు తెరలు దట్టంగా అలుముకున్నాయి. రైల్వేట్రాక్‌పై పొగ మంచు కప్పేసింది.
కొత్తూరు/కొత్తూరు రూరల్, నవంబర్ 25: కొత్తూరు మండలంలోని వివిధ గ్రామాలతో పాటుగా కొత్తూరును పొగమంచులో కమ్మేసింది. జాతీయరహదారిపై ప్రయాణం ఇబ్బంది కావటంతో కొందరు వాహనాలను నిలుపుకున్నారు. ముఖ్యంగా బెంగళూరు ఎన్‌హెచ్-44పై ఎక్కువగా పొగమంచు పేరుకుపోయింది.
బాగాయిపల్లి, ముద్దాయిపేట రహదారిలో..
యాలాల, నవంబర్ 25 : ప్రకృతిలో కనువిందు చేసే దృశ్యాలు బాగాయిపల్లి, ముద్దాయిపేట రహదారిలో గురువారం ఉదయం కనిపించాయి. ఉదయం 9 గంటల వరకు రహదారిని పొగమంచు కమ్ముకున్నది.
బొంరాస్‌పేట పరిసర ప్రాంతాల్లో..
బొంరాస్‌పేట, నవంబర్ 25 : బొంరాస్‌పేట పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్మేసింది. ఇల్లు, చెట్టు, రోడ్లు, ఎదురుగా వచ్చే మనుషులు, వాహనాలు కనిపించలేనంతగా మంచు కురిసింది. హైదరాబాద్-బీజాపూర్ 163వ నంబరు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు మంచు ప్రభావంతో నిదానంగా వెళ్లాయి. కొద్దిసేపటి తరువాత భానుడి లేలేత కిరణాలకు మంచు తెరలు క్రమంగా కనుమరుగయ్యాయి.