పేదింటి పెద్దమ్మ కథ
అనగనగా కథల్లో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. ఎవరు ఏ వేళలో ఆకలితో వెళ్లినా లేదనకుండా కడుపు నింపుతుంది. ప్రేమగా మాట్లాడుతుంది. తన కష్టాన్నీ కన్నీళ్లను మాత్రం బయటికి తెలియనివ్వదు. కేరళలోని శ్రీపథ్కు చెందిన కాత్యాయని కూడా ఓ పేదరాశి పెద్దమ్మే. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఆమె జీవితం మీద రాసిన ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్' పుస్తకం ఇటీవల విడుదలైంది
అనగనగా కథల్లో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. ఎవరు ఏ వేళలో ఆకలితో వెళ్లినా లేదనకుండా కడుపు నింపుతుంది. ప్రేమగా మాట్లాడుతుంది. తన కష్టాన్నీ కన్నీళ్లను మాత్రం బయటికి తెలియనివ్వదు. కేరళలోని శ్రీపథ్కు చెందిన కాత్యాయని కూడా ఓ పేదరాశి పెద్దమ్మే. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఆమె జీవితం మీద రాసిన ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ పుస్తకం ఇటీవల విడుదలైంది.
కాత్యాయని తండ్రి రోజుకూలీ. ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడంతో.. పిన్న వయసులోనే చదువు మానేసింది. పెండ్లి, ఆరుగురు పిల్లలు, భర్త మరణం.. ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. బిడ్డల పోషణ భారం తన మీదే పడింది. ఆకలికి చదువుతో పన్లేదు. ఉద్యోగంతో నిమిత్తం లేదు. గంపెడు పిల్లల తల్లి కాత్యాయని మీదా జాలి చూపలేదు. బిడ్డల పొట్ట నింపేందుకు ఆమె రోడ్లు ఊడ్చింది. పాచి పనులు చేసింది. చదువు మీద మక్కువతో అన్ని బాధ్యతలూ తీరాక మళ్లీ పుస్తకం పట్టింది. 96 ఏండ్ల వయసులో నాలుగో తరగతి పాసైంది. ప్రభుత్వం వయోజనుల కోసం ‘అక్షర లక్ష్యం’ పేరుతో నిర్వహించే ఈ పరీక్షను సుమారు 44 వేల మంది రాశారు. అందులో వందకు 98 మార్కులు తెచ్చుకుని మొదటి స్థానంలో నిలిచింది కాత్యాయని అమ్మ. దీంతో ఆమె పేరు దేశమంతా మారుమోగింది. ఎందరికో ఆ కథ స్ఫూర్తినిచ్చింది. కామన్వెల్త్ లెర్నింగ్ సంస్థ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్నీ అందుకున్నది కాత్యాయని అమ్మ.
పిల్లల కోసం ..
సెలెబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా ఒకసారి కాత్యాయని అమ్మను కలిశాడు. ఆమె మాట తీరు, ఆలోచనలు ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఎన్ని కష్టాలొచ్చినా సమాజాన్ని కానీ, వ్యక్తుల్ని కానీ నిందించలేదా తల్లి. పైగా పదో తరగతి వరకూ చదువుకోవాలని ఉందంటూ తన చిన్నిచిన్ని ఆశల గురించే మాట్లాడింది. అందుకేనేమో, వికాస్ ఖన్నాకు తన నాయనమ్మ గుర్తుకొచ్చింది. ‘చదువుకోలేక పోతేనేం.
బామ్మలు ఎంతో తెలివైన వాళ్లు. కుటుంబాన్ని కలిపి ఉంచడం తెలిసిన వాళ్లు… ఇక చదువుకుని ఉంటేనా, ఎక్కడో ఉండేవారు. కాత్యాయని అమ్మ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైన మనిషి. అందుకే ఆమె కథను డాక్యుమెంటరీగా తీయాలనీ, పుస్తకంగా తీసుకురావాలనీ నిర్ణయించుకున్నా. ఈ పుస్తకం రాసేప్పటికి కొవిడ్ విజృంభించింది. ఆ సమయంలో తమ జీవితంలో ఎన్నో అవకాశాలు కోల్పోయామనీ, విలువైన సమయం వృథా అయిందనీ చాలా మంది భావించారు, బాధపడ్డారు. కానీ సాధించాలనుకునే వాళ్లకు ఆలస్యం అన్నది ఉండదని చెప్పడమే నా ఉద్దేశం. ఈ స్ఫూర్తి చిన్నపిల్లల్లో రగిలిస్తే కనుక.. జీవితాంతం ఉంటుందన్న ఆలోచనతో ఓ పుస్తకాన్ని రూపొందించాను. కాత్యాయని అమ్మకు వందేళ్లు నిండిన సందర్భంగా దాన్ని మార్కెట్లో విడుదల చేశాం. పెద్దలకూ ఇది నచ్చుతుంది’ అంటారు వికాస్. బేర్‌ఫుట్ ఎంప్రెస్… ఉత్తికాళ్లతో నడిచే వ్యక్తిలోనూ ఓ సామ్రాజ్ఞి ఉందని చాటిచెప్పే ఈ కథ నచ్చడానికి వయసుతో సంబంధం ఏముంటుంది?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

