అమరావతి : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 41,173 కొవిడ్ పరీక్షలు చేయగా.. కొత్తగా 878 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. తాజాగా 1,182 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 13 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 20,13,001కు చేరాయి. ఇందులో 19,84,301 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,838 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో జిల్లాలో 255, పశ్చిమ గోదావరిలో 166 మంది, ప్రకాశంలో 96 కేసులు నమోదయ్యాయి.