ఢిల్లీ సరోజ్ హాస్పిటల్లో 80 మంది వైద్యులకు కరోనా
ఢిల్లీ సరోజ్ హాస్పిటల్లో 80 మంది వైద్యులకు కరోనా | ఢిల్లీలోని సరోజ్ హాస్పిటల్లో 80 మంది వైద్యులు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పంజా విసురుతోంది. రోజు వేలాది కేసులు వస్తుండడంతో హాస్పిటళ్లకు రోగులు క్యూ కడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కేసుల మధ్య పలువురు వైద్యులు మహమ్మారి బారినపడుతున్నారు. ఢిల్లీలోని సరోజ్ హాస్పిటల్లో 80 మంది వైద్యులు కరోనా పాజిటివ్‌గా పరీక్షించడం కలకలం రేపుతోంది. ఇందులో 12 మంది వైద్యులు ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండగా.. 12 మంది చికిత్స కోసం హాస్పిటల్లో చేరారు. ఆసుపత్రిలో సీనియర్ సర్జన్ డాక్టర్ ఏకే రావత్ కరోనాతో మరణించారు. ఆయన 27 సంవత్సరాల పాటు సరోజ్ హాస్పిటల్లో సేవలందించారు. ఢిల్లీ ఆసుపత్రుల్లో 300 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇప్పటి వరకు కొవిడ్ పాజిటివ్‌గా పరీక్షించినట్లు తేలింది. ప్రస్తుతం సరోజ్ హాస్పిటల్లో అవుట్ పేషెంట్ (ఓపీడీ) సేవలు నిలిపివేశారు. ఆదివారం ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ (జీటీబీ) హాస్పిటల్లో ఓ యువ వైద్యుడు అనాస్ ముజాహిద్ (26) కొవిడ్ సంబంధిత సమస్యలతో మృత్యువాతపడ్డాడు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో నిన్న ఒకే రోజు 13,336 కొవిడ్ కేసులు నమోదవగా.. 273 మంది కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి..
ఈ లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
అసోం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హిమంత
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. ఎన్నికల ఫలితాలపై మేథోమధనం
వాహనాదరులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు
ఉత్తరాఖండ్‌లో రేపటి నుంచి కర్ఫ్యూ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

