మూసాపేట/చిన్నచింతకుంట, జూలై 23 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కింద బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోటి కార్యకర్తకు ఆర్థిక సాయం జమ చేసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా అందజేయించారు.
పార్టీ సీనియర్ కార్యకర్త చిన్న కథలయ్య కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసి గ్రామ బీఆర్ఎస్ నాయకుల సమాచారం మేరకు మాజీ ఎమ్మెల్యే ఆల గ్రామానికి వెళ్లి కథలయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పుట్టిరోజును పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు రూ.70 వేలు జమ చేయగా ఆ డబ్బును ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కథలయ్యకు అందజేశారు.