టోక్యో : భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో ఏడు కొత్త విమానాలు కూలిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. అయితే ఆ విమానాలు ఏ దేశానికి చెందినవో ఆయన స్పష్టం చేయలేదు. రెండు న్యూక్లియర్ పవర్ దేశాల మధ్య రగిలిన చిచ్చును వాణిజ్యంతో ఆపేసినట్లు ట్రంప్ మరో సారి పేర్కొన్నారు. టోక్యోలో మంగళవారం వ్యాపారవేత్తలతో జరిగిన డిన్నర్ పార్టీలో ట్రంప్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏడు విమానాలను కూల్చేశారని, ఏడు విమానాలు కొత్తవే అని, అందమైన ఆ విమానాలను నేలకూల్చారని, రెండు అణ్వాయుధ దేశాలు ఆ ఫైట్‌లో నిమగ్నమైనట్లు ట్రంప్ చెప్పారు. అయితే పాకిస్థాన్, భారత్ మధ్య మొదలైన యుద్ధానికి వాణిజ్యంతో బ్రేక్ వేసినట్లు ట్రంప్ తెలిపారు.
#WATCH | President Donald Trump says, “I’m doing a trade deal with India, and I have great respect and love for Prime Minister Modi. We have a great relationship. Likewise, the Prime Minister of Pakistan is a great guy. They have a Field Marshal. You know why he’s a Field… pic.twitter.com/MHHRJlpnC4
— ANI (@ANI) October 29, 2025
భారత్‌తో ట్రేడ్ డీల్ చేస్తున్నానని, ప్రధాని మోదీ పట్ల తనకు ప్రేమ, గౌరవం ఉందన్నారు. తమ మధ్య మంచి రిలేషన్ ఉందన్నారు. అలాగే పాక్ ప్రధాని కూడా మంచి వ్యక్తే అని, పాక్ ఫీల్డ్ మార్షల్ ఓ గొప్ప ఫైటర్ అని అన్నారు. కానీ మీరు ఇలాగే ఘర్షణ పడితే, అప్పుడు మీతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం కుదరదని ఆ రెండు దేశాలకు వార్నింగ్ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఇక 24 గంటల్లోనే రెండు దేశాలు యుద్ధాన్ని ఆపినట్లు చెప్పారు.ఇండోపాక్ వార్‌ను ఆపినట్లు మే 10వ తేదీన ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఇండోపాక్ వార్‌ను తానే ఆపినట్లు ట్రంప్ చెబుతూ వస్తున్నారు. కానీ డీజీఎంవోల మధ్య జరిగిన సంభాషణల ఆధారంగానే పాక్‌తో యుద్ధాన్ని ఆపినట్లు భారత్ పేర్కొన్న విషయం తెలిసిందే.