హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 569 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో నలుగురు వ్యక్తులు మరణించారు. 657 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల 3,823కి చేరుకుంది. తాజా కేసులతో కలుపుకుని పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,957కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,582గా ఉంది. అధికారులు శనివారం 1,05,201 శాంపిల్స్‌ను పరీక్షించారు.
జిల్లాల వారీగా కొవిడ్ పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-4, భద్రాద్రి కొత్తగూడెం-17, జీహెచ్ఎంసీ-82, జగిత్యాల-22, జనగామ-11, జయశంకర్ భూపాలపల్లి-6, జోగులాంబ గద్వాల-0, కామారెడ్డి-4, కరీంనగర్-64, ఖమ్మం-40, కొమురంభీం ఆసిఫాబాద్-2, మహబూబ్‌నగర్-7, మహబూబాబాద్-11, మంచిర్యాల-17, మెదక్-2, మేడ్చల్ మల్కాజ్గిరి-33, ములుగు-7, నాగర్‌కర్నూల్-2, నల్లగొండ-39, నారాయణపేట-1, నిర్మల్-2, నిజామాబాద్-8, పెద్దపల్లి-27, రాజన్న సిరిసిల్ల-19, రంగారెడ్డి-27, సంగారెడ్డి-9, సిద్దిపేట-18, సూర్యాపేట-15, వికారాబాద్-3, వనపర్తి-2, వరంగల్ రూరల్-8, వరంగల్ అర్బన్-51, యాదాద్రి భువనగిరి-9.