మరో ఇద్దరు కోల్ ఇండియాకు ఎంపిక
మేడ్చల్ రూరల్, నవంబర్ 2: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్‌లో చదివిన సాయికుమార్‌ను రూ.56.7 లక్షల వార్షిక వేతనంతో ఆస్ట్రేలియాలోని ‘వెస్ట్ గోల్డ్ రిసోర్సెస్’ కంపెనీ ఎంపిక చేసుకొన్నది. సుజిత్‌కుమార్, సామంత్‌రెడ్డి జాతీయస్థాయిలో పోటీపడి కోల్ ఇండియాలో ట్రైనీ ఇంజినీర్లుగా ఎంపికయ్యారు. తమ ఉత్తమ బోధనకు సాయికుమార్, సుజిత్‌కుమార్, సామంత్‌రెడ్డి నిదర్శమని కళాశాల డైరెక్టర్ రామస్వామిరెడ్డి పేర్కొన్నారు.