పీఎం కేర్ నిధులతో దేశంలో 551 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు
దేశంలో 551 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు | కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది. నిత్యం పెరుగుతూ వస్తున్న కేసులతో ప్రాణవాయువుకు తీవ్ర కొరత ఏర్పడుతున్నది.

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది. నిత్యం పెరుగుతూ వస్తున్న కేసులతో ప్రాణవాయువుకు తీవ్ర కొరత ఏర్పడుతున్నది. ఇప్పటికే పలువురు ఆక్సిజన్ లభించక మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో మెడికల్ ఆక్సిజన్ కొరత పరిష్కారానికి కేంద్రం చర్యలు చేపడుతున్నది. దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో ప్రత్యేకంగా 551 మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పనుంది. ఈ మేరకు నిధుల కేటాయింపునకు ప్రధాని కేర్స్ ఫండ్ ఆదివారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్లాంట్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్లాంట్ల ఏర్పాటు జరుగుతుందని పీఎంఓ పేర్కొంది. ప్లాంట్ల ఏర్పాటుతో జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరాలో ఆకస్మాత్తుగా అంతరాయం లేకుండా వీలు కలుగనుంది. కొవిడ్ రోగులతో పాటు ఇతర రోగులందరికీ నిరంతరం ఆక్సిజన్ అందుబాటులో ఉంటుంది.
ఇవికూడా చదవండి..
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి
కరోనా ఐసోలేషన్ వార్డులుగా రైల్వే బోగీలు.. అందుబాటులో 3,816 కోచ్‌లు
వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు.. 99 రోజుల్లో 14 కోట్ల డోసుల పంపిణీ
కరోనాతో బెంగాల్లో టీఎంసీ అభ్యర్థి మృతి
‘జన్‌కీ బాత్’ ముఖ్యం.. : రాహుల్ గాంధీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

