టోక్యో : జపాన్‌లోని చిబా ప్రాంతంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 5.8గా నమోదైంది.
ఉదయం 9 గంటల 27 నిమిషాల ప్రాంతంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
అక్షాంశాలకు 33.7 డిగ్రీల ఉత్తరంగా.. రేఖాంశాలకు140.5 డిగ్రీల తూర్పునకు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షప్తమైనట్లు స్థానిక మీడియా జిన్హువా తెలిపింది.
సునామి హెచ్చరికలేవి జారీ చేయలేదు. గత వారం, 7.2 తీవ్రతతో బలమైన భూకంపం 60 కిలోమీటర్ల లోతులో ఈశాన్య జపాన్ తీరాన్ని తాకింది.
జపాన్‌కు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పేరుంది. పసిఫిక్ మహాసముద్రం అంచులో గుర్రపుడెక్క ఆకృతిలో ఇది ఉంటుంది. అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాలు ఇక్కడ పరిపాటి.