తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్ జిల్లాల్లో ఉన్న రెండు పందుల ఫార్మ్స్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదు అయ్యాయి. పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు తేలింది. భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూర్టీ యానిమల్ డిసీజెస్ సంస్థలో శ్యాంపిళ్లను పరీక్షించారు. ఓ ఫార్మ్ హౌజ్లో భారీ సంఖ్యలో పందులు చావడం వల్ల శ్యాంపిళ్లను టెస్టింగ్కు పంపామని జంతుశాఖ అధికారి తెలిపారు. అయితే పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని, అందు వల్లే సుమారు 300 పందుల్ని వధించాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.