ముంబై: ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్(Ajit Pawar) వర్గం ఇవాళ తమ బలాన్ని ప్రదర్శించింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఎంఈటీ సెంటర్లో అజిత్ పవార్ తన ఎమ్మెల్యేలతో కలిసి భారీ మీటింగ్ ఏర్పాటు చేశారు. శరద్ పవార్‌కు గుడ్‌బై చెప్పి మహా ప్రభుత్వంలో మంత్రి పదవిని అజిత్ పవార్ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. వైబీ చౌహాన్ సెంటర్లో శరద్ పవార్ శ్రేయోభిలాషులు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. సుప్రియా సూలే నేతృత్వంలో ఆ మీటింగ్ జరిగింది.
#WATCH | Maharashtra's Deputy CM Ajit Pawar and leaders of his faction display a show of strength as they gather at MET Bandra in Mumbai for a meeting of NCP. pic.twitter.com/AXwBouBqFv
— ANI (@ANI) July 5, 2023
అజిత్ పవార్ వర్గంలో ఇవాళ 29 మంది ఎమ్మెల్యేలు మీటింగ్‌కు హాజరయ్యారు. స్టేజ్‌పై భారీ స్థాయిలో వాళ్లంతా షో చేశారు . ఎన్సీపీలో మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అజిత్ వర్గానికి అనుకూలంగా 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లంతా ఇవాళ ఎంఈటీ సెంటర్లో జరిగిన భేటీకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ స్టేజ్‌పై మాత్రం 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తేలింది.
#WATCH | NCP chief Sharad Pawar arrives at YB Chavan in Mumbai. Sharad Pawar's NCP and other party leaders display a show of strength as they gather at YB Chavan in Mumbai.
(Source: NCP (Sharad Pawar faction) pic.twitter.com/xdJN20Lmfw
— ANI (@ANI) July 5, 2023
ఒకవేళ అనర్హత వేటు పడవద్దు అనుకుంటే, అజిత్ పవార్ వర్గానికి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుందని మహారాష్ట్ర శాసనసభ మాజీ కార్యదర్శి అనంత్ కల్సే తెలిపారు. అయితే ఎటువంటి అనర్హత వేటు పడదని, లీగల్ అభిప్రాయాలు తీసుకున్నాకే తిరుగుబాటు ప్రకటించినట్లు అజిత్ పవార్ వర్గం పేర్కొన్నది. పార్టీ పేరు, గుర్తు తమకే రావాలని కోరుతూ కొన్ని రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనున్నట్లు కూడా అజిత్ వర్గం వెల్లడించింది.