పెగాసస్ వ్యవహారం.. 29 మొబైళ్లను పరిశీలించిన నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పెగాసస్ నిఘా స్కామ్‌ను పరిశీలిస్తున్న ముగ్గురు సభ్యుల కమిటీకి తమ రిపోర్ట్‌ను సమర్పించేందుకు అదనపు సమయాన్ని కోర్టు కేటాయించింది. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. నిపుణుల కమిటీ ఇప్పటి వరకు 29 మొబైల్ ఫోన్లను పరిశీలించినట్లు తెలుస్తోందని, ప్రక్రియను పూర్తి చేసేందుకు వాళ్లకు మరింద అదనపు సమయాన్ని కేటాయిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. టెక్నికల్ కమిటీ తమ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేస్తుందని, సూపర్వైజరీ జడ్జికు రిపోర్ట్ అందిన తర్వాత జూలైలో ఈ కేసును మళ్లీ విచారిస్తామని కోర్టు పేర్కొన్నది. పెగాసస్ వ్యవహారాన్ని తేల్చేందుకు ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీని గత ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు నియమించిన విషయం తెలిసిందే. పెగాసస్ స్పైవేర్‌తో ప్రభుత్వం ప్రముఖులపై నిఘా పెడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కేసులో కొందరు సుప్రీంను ఆశ్రయించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

