Aamir Khan | భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనిపించుకున్నాడు. ‘దంగల్’ సినిమా చైనాలో కూడా అదరగొట్టడంతో ఏకంగా రూ.2 వేల కోట్ల మైలురాయిని సైతం ఆమిర్ సాధించిన విషయం తెలిసిందే. అంత సత్తా ఉన్న ఈ హీరో గత రెండు చిత్రాలతో దారుణమైన ఫలితాలందుకున్నాడు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చడ్డా’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి.ఆ తర్వాత వచ్చిన ‘సితారే జమీన్ పర్’ సినిమాకు టాక్ కొంచెం డివైడ్‌గా వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర బాగానే నిలబడింది.
సినిమాల విషయం పక్కన పెడితే.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇంటిని 25 మంది ఐపీఎస్ అధికారులు సందర్శించడం ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై బాంద్రాలోని ఆయన నివాసానికి వీరంతా బస్సులు, వ్యాన్లలో హఠాత్తుగా చేరుకోవడంతో ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఆమిర్ ఖాన్ టీమ్‌ను సంప్రదించింది. అయితే వారి స్పందన అంత క్లారిటీగా లేదు. మేమూ ఇంకా ఆరా తీస్తున్నాం. అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో పరిణామాల వెనక నిజమైన ఉద్దేశ్యం ఏమిటో ఇంకా సస్పెన్స్‌గా ఉంది.
ఇతర కథనాల ప్రకారం, అధికారులు ఆమిర్ ఖాన్‌ను కలవడానికి వచ్చారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇది నిజమే అయితే, ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గురించే చర్చ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమిర్ ఖాన్ త్వరలోనే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) కు చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 14 నుండి 24 వరకు ఈ వేడుకని గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్లో ఆయన నటించిన క్లాసిక్ మూవీ ‘తారే జమీన్ పర్’ ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ వేదికపై ఆమిర్ కొత్త ప్రాజెక్టులని ప్రకటించే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.