5 రోజులు.. 25 విమానాలు.. 300 టన్నుల కార్గో

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య సుమారు నాలుగు లక్షలకు, రోజువారీ మరణాల సంఖ్య మూడు వేలకుపైగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆసుత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్, ఔషధాలకు కొరత ఏర్పడింది. దీంతో భారత్‌లో కరోనా సంక్షోభంపై ప్రపంచ దేశాలు స్పందించాయి. తమకు తోచిన సహాయాన్ని అందించాయి. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, రెమ్‌డెసివిర్‌తోపాటు ఇతర మందులు, మాస్కులు, పీపీఈ కిట్లను భారత్‌కు పంపించాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి గత ఐదు రోజుల్లో 25 విమానాల ద్వారా 300 టన్నుల కార్గో చేరినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు అమెరికా, బ్రిటన్, యూఏఈ, జర్మనీ, చైనా, ఉజ్బెకిస్తాన్, థాయిలాండ్, ఖతార్, హాంకాంగ్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన 25 విమానాల్లో 300 టన్నుల కార్గో చేరిందని చెప్పారు. భారత వాయు సేనకు చెందిన ఐఎల్76, సీ-130, సీ-5, సీ-17 వంటి విమానాలు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయని వివరించారు.
దేశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో సుమారు 5,500 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, సుమారు 3,200 ఆక్సిజన్ సిలిండర్లు, 9,28,000 మాస్క్‌లు, 1,36,000 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు వంటివి విదేశాల నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరాయని అధికారులు తెలిపారు. సహాయక సామగ్రి నిల్వ, పంపిణీ కోసం విమానాశ్రయంలో 3,500 చదరపు మీటర్ల డెడికేటెడ్ లాజిస్టిక్స్ సదుపాయమైన జీవోడే గిడ్డంగి ఉన్నదని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (డీఐఏఎల్) పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

