ముంబై: ముంబై క్రూజ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆర్యన్‌ఖాన్‌ను విడుదల చేయడానికి అతని తండ్రి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖడేతో పాటు మరో ఇద్దరు రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్టు ఈ కేసులోని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ సెయిల్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఎన్సీబీ తోసిపుచ్చింది. ఏజెన్సీపై దుష్ప్రచారం చేయడంలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నట్టు పేర్కొంది.