SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI SO వెల్త్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 207 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిని జోనల్ హెడ్, రీజినల్ హెడ్, ఏవీపీ వెల్త్ వంటి ఏడు రకాల పోస్టులను నింపనుంది. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. సెప్టెంబర్ 25 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివిన తరువాత దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
207 ఖాళల్లో VP వెల్త్, AVP వెల్త్ ఉద్యోగాలే అధికంగా ఉన్నాయి.
జోనల్ హెడ్ (రిటైల్)- 1
రీజినల్ హెడ్ (RH)- 5
రిలేషన్షిప్ మేనేజర్-టీమ్‌లీడ్- 24
ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (ఐవో)- 4
VP వెల్త్- 91
AVP వెల్త్- 73

Sbi Posts
అర్హతలు
పోస్టును బట్టి ఎంబీఏ, పీజీ, సీఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు జోనల్ హెడ్, రీజినల్ హెడ్లకు 35 నుంచి 50, RM-టీమ్ లీడ్, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్‌లకు 28 నుంచి 42, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌కు 28 నుంచి 40, VP వెల్త్‌కు 26 నుంచి 42, AVP వెల్త్‌కు 23 నుంచి 35 ఏండ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. పోస్టులు, అభ్యర్థుల సంఖ్యను బట్టి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రౌండ్లలో పర్సనల్, టెలిఫోనిక్, వీడియో ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ సెప్టెంబర్ 25. ఇతర వివరాలు వెబ్సైట్ https://sbi.bank.in/లో చూడండి.