న్యూఢిల్లీ, జనవరి 10: ప్రీమియం ఎస్యూవీ కొడిక్యూలో నూతన వెర్షన్ను మార్కెట్లోకి విడుదల చేసింది స్కోడా. ఈ కారు రూ.34.99 లక్షల నుంచి రూ.37.49 లక్షల మధ్యలో లభించనున్నది. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్లో ఏడుగురు కూర్చోవడానికి వీలున్నది. లగ్జరీ ఫీచర్స్తో రూపొందించిన ఈ మోడల్ కేవలం 7.8 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.