నిజామాబాద్ సిటీ, నవంబర్ 16 : నిజామాబాద్టౌన్ వీఐపీ, ఇంటర్ కాలేజేస్ అండర్ ఆర్మ్ క్రికెట్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20,21న క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ అండర్ఆర్మ్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గడీల రాము లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వివరాలను వెల్లడించారు. దేశంలో అండర్ ఆర్మ్ క్రికెట్ పోటీలకు మంచి ఆదరణ ఉందని, ఈ క్రీడను రాష్ట్రంలోఅభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొదటిసారి నిజామాబాద్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం లో ఈ పోటీలు కొనసాగుతాయన్నారు. త్వరలోనే పాఠశాల స్థాయిలో కూడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో కమిటీ కన్వీనర్ అలుక కిషన్, తెలంగాణ అండర్ఆర్మ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్, టీఎన్జీవో కార్యదర్శి అమృత్కుమార్, జయసింహగౌడ్ పాల్గొన్నారు.