హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,384కు పెరిగింది. 258 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,57,923 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా ఒకరు వైరస్ బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,920కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,541 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 41,690 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 68 కేసులు రికార్డయ్యాయి.