హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : తిరుపతి -షిర్డీకి 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు ఈ రైళ్ల సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. తిరుపతి -సాయినగర్ షిర్డీ రైలు (07637) తిరుపతిలో ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సోమవారం ఉదయం 10.45 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది.
ఆగస్టు 3నుంచి సెప్టెంబర్ 28వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. షిర్డీ-తిరుపతి రైలు (07638) సోమవారం రాత్రి 7.35 గంటలకు బయల్దేరి మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసులను ఆగస్టు 4నుంచి సెప్టెంబర్ 29వరకు నడవనున్నారు.